covid vaccination: తగ్గిన వ్యాక్సినేషన్‌ వేగం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం తగ్గింది. కేంద్రం సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభించిన నాటితో (జూన్‌ 21) పోలిస్తే రోజువారీ సగటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. జూన్‌ 21-27 మధ్య రోజుకు సగటు.....

Published : 12 Jul 2021 17:10 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం తగ్గింది. కేంద్రం సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభించిన నాటితో (జూన్‌ 21) పోలిస్తే రోజువారీ సగటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. జూన్‌ 21-27 మధ్య రోజుకు సగటున 61.14 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయగా.. జూన్‌ 28- జులై 4 మధ్య ఆ సగటు 41.92 లక్షలకు చేరింది. జులై 5-11 మధ్య కేవలం రోజుకు 34.32 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందించినట్లు కొవిన్‌ పోర్టల్‌లో ఉన్న డేటా వెల్లడిస్తోంది.

కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకోగా.. మరికొన్ని చోట్ల తగ్గింది. హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వేగం తగ్గింది. అదే సమయంలో కేరళ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలీ, జమ్మూకశ్మీర్ తదితర చోట్ల వేగం కొంతమేర పెరిగింది. అయితే, సార్వత్రిక టీకా కార్యక్రమాని కంటే ముందు పరిస్థితితో పోల్చినప్పుడు మొత్తంగా వేగం పెరిగిందనే చెప్పాలి. దేశంలో ఇప్పటి వరకూ 37.73 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని