Indonesia: ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

ఇండోనేసియాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మౌమెరి పట్టణానికి ఉత్తరాన 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Published : 14 Dec 2021 15:32 IST

జకార్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. మౌమెరి పట్టణానికి ఉత్తరాన 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.3గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫ్లోరెస్ ద్వీపంలో.. సముద్రగర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం తీవ్రత కారణంగా ఇండోనేసియా.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కలిగిన నష్టంపై ఇంకా పూర్తి సమాచారం అందలేదని ఇండోనేసియా విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. సముద్రానికి దూరంగా పారిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని