Rajya sabha: 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

దేశ వ్యాప్తంగా త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర.....

Updated : 12 May 2022 16:33 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 10న పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అత్యధికంగా 11 సీట్లలో ఎన్నికలు జరగనుండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులలో ఆరేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో సురేశ్‌ ప్రభు, టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి, విజయసాయి రెడ్డి పదవీ కాలం జూన్‌ 21తో ముగియనుండగా.. తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పదవీ కాలం జూన్‌ 29తో ముగియనుంది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో 2 స్ధానాలు, మధ్యప్రదేశ్‌ 3, తమిళనాడు 6, కర్ణాటక 4, ఒడిశా 3, మహారాష్ట్ర 6, పంజాబ్‌ 2, రాజస్థాన్‌ 4, ఉత్తర్‌ప్రదేశ్‌ 11, ఉత్తరాఖండ్‌ 1, బిహార్‌ 5, హరియాణా 2, ఝార్ఖండ్‌ 2 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్‌ జారీ: మే 24
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: మే 31
  • నామినేషన్ల పరిశీలన: జూన్‌ 1
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూన్‌ 3
  • ఎన్నికల తేదీ: జూన్‌ 10
  • ఎన్నికలు జరిగే సమయం: ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 
  • ఓట్ల లెక్కింపు: జూన్‌ 10 (సాయంత్రం 5గంటల నుంచి..)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని