26న భారత్‌ బంద్‌

వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై..

Updated : 11 Mar 2021 13:40 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అలాగే పెరిగిన చమురు ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు తెలిపారు. మార్చి 29న హోలీకా దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేయనున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని