Kashmir: ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లిన జమ్ము కశ్మీర్‌..!

జమ్ము కశ్మీర్‌ శనివారం రాత్రి నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లు బుద్గామ్‌, పుల్వామాల్లో చోటు చేసుకొన్నాయి.

Updated : 30 Jan 2022 10:48 IST

 ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ము కశ్మీర్‌లో శనివారం రాత్రి నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్లు బుద్గామ్‌, పుల్వామాల్లో చోటు చేసుకొన్నాయి. మృతులను లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తించారు.

‘‘పాకిస్థాన్‌ మద్దుతు ఉన్న లష్కరే, జైషే మహమ్మద్‌లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాం’’ అని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మృతుల్లో జైషే టాప్‌ కమాండర్‌ జహిద్‌ వానీ , పాకిస్థాన్‌కు చెందిన ఖఫీల్‌ అలియాస్‌ ఛోటు ఉన్నారు. పుల్వామా ప్రాంతాలో ఖఫీల్‌ 2020 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్లు భద్రతా దళాలకు పెద్ద విజయంగా అభివర్ణించారు. ఇక పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు ఉగ్రవాదులను.. బుద్గామ్‌లోని చారార్‌ ఇ షరీఫ్‌ ప్రాంతంలో మరో ఉగ్రవాదిని  దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి.

2022 జనవరిలో కశ్మీర్‌లో దాదాపు ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌ జరిగింది. మొత్తం 11 ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని