Tamil Nadu: స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్‌ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మరణానంతరం అవయవ దానం చేసే (అవయవ దాతలు) వారికి సముచిత గౌరవం ఇచ్చే ఉద్దేశంతో తమిళనాడులోని స్టాలిన్‌ (Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 23 Sep 2023 16:13 IST

చెన్నై: తమిళనాడులోని స్టాలిన్‌(Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) శనివారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అవయవ దానం విషయంలో తమిళనాడు (Tamil Nadu) దేశంలోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు (organ donors), వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్‌ డోనర్స్‌ అంత్యక్రియలకు (Funerals) రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎం స్టాలిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని