లిబియాలో వైమానిక దాడి..28 మంది మృతి

లిబియా రాజధాని ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై వైమానిక దాడి జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కనీసం 28 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.......

Published : 05 Jan 2020 12:42 IST

ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై వైమానిక దాడి జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కనీసం 28 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో క్యాడెట్లంతా మైదానంలో పరేడ్‌ కోసం సన్నద్ధమవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత ఏప్రిల్‌ నుంచి తీవ్ర స్థాయిలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. సుదీర్ఘకాలం ఆ దేశాన్ని పాలించిన నియంత గడాఫీని నాటో దళాలు 2011లో గద్దె దించి హతమార్చిన నాటి నుంచి లిబియాలో అస్థితర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజా దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని