రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్‌?

రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్‌ రాజీనామా చేశారు.

Published : 16 Jan 2020 05:20 IST

ప్రతిపాదించిన అధ్యక్షుడు పుతిన్‌

మాస్కో: రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్‌ రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడు పుతిన్‌కు సమర్పించారు. మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాతే మెద్వదేవ్‌ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రష్యా కొత్త  ప్రధానిగా మిషుస్తిన్‌ పేరును పుతిన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అధినేతగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మెద్వదేవ్‌ బాధ్యతలు చేపట్టాలని పుతిన్‌ సూచించారు.

లక్ష్యాలను చేరుకోవడంలో మెద్వదేవ్‌ మంత్రివర్గం విఫలమైందని పుతిన్‌ భావిస్తున్నారని రష్యా మీడియా తెలిపింది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన మెద్వదేవ్‌ 2012 నుంచి ఇప్పటి వరకు రష్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని