రేపు షా నివాసానికి వెళ్తాం..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహిన్‌బాగ్‌ నిరసనకారులు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసానికి వెళ్లేందుకు పిలుపునిచ్చారు. సీఏఏను వెనక్కి తీసుకోవాలనే తమ ప్రధాన డిమాండుతో అమిత్‌షాతో చర్చించేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నట్లు నిరసనకారులు పేర్కొన్నారు.

Published : 15 Feb 2020 19:06 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహిన్‌బాగ్‌ నిరసనకారులు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసానికి వెళ్లేందుకు పిలుపునిచ్చారు. సీఏఏను వెనక్కి తీసుకోవాలనే తమ ప్రధాన డిమాండుతో అమిత్‌షాతో చర్చించేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నట్లు నిరసనకారులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు వారు ర్యాలీ ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై ఓ మీడియా సంస్థ హోంమంత్రిత్వ శాఖ అధికారులను ఆరా తీయగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు.

ఈ సందర్భంగా నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ.. తాము సీఏఏ విషయమై చర్చించేందుకు అమిత్‌షా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఏఏ వల్ల ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే తనను వచ్చి కలవమని గతంలో అమిత్‌షానే చెప్పారు. కాబట్టి తాము రేపు ఆయనను కలిసి తమ సమస్యను చర్చించనున్నట్లు చెప్పారు. సీఏఏకు పార్లమెంటులో ఆమోదం తెలిపినప్పటి నుంచి.. షాహిన్‌బాగ్‌లో ఆ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని