ట్రంప్‌ సబర్మతిని సందర్శిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లో ఏర్పాట్లూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 24న వాషింగ్టన్‌ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు చేరుకోనున్న ట్రంప్‌ సబర్మతి.........

Published : 21 Feb 2020 22:29 IST

శ్వేత సౌధమే నిర్ణయిస్తుందన్న గుజరాత్‌ సీఎం

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 24న వాషింగ్టన్‌ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు చేరుకోనున్న ట్రంప్‌.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రంప్‌ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించరంటూ గత రెండు రోజులుగా వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ స్పందించారు. ఆశ్రమ సందర్శన విషయంలో తుది నిర్ణయం శ్వేతసౌధానిదేనని ఆయన స్పష్టంచేశారు. దీనిపై తమకు సమాచారం రాగానే చెబుతామని విలేకర్లతో అన్నారు. 

అగ్రరాజ్య అధినేత ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. మోతేరాలోని నూతనంగా నిర్మించిన అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ట్రంప్‌, మోదీ పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని