మలాలాను కలిసిన గ్రెటా థన్‌బర్గ్‌..!

లండన్‌: ఒకరు బాలికలకు విద్యకోసం పోరాడుతే మరొకరు పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకేచోట కలిసి ముచ్చటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న మలాలాను స్వయంగా వెళ్ళి కలిశారు.

Updated : 27 Feb 2020 10:49 IST

లండన్‌: ఒకరు బాలికల విద్యకోసం పోరాడితే.. మరొకరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే చోట కలిశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న మలాలాను స్వయంగా వెళ్లి కలిశారు. తమ పోరాట అనుభవాలతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై వీరిద్దరు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరు కలిసిన పొటోను జతచేసిన మలాలా ‘థాంక్యూ గ్రెటా థన్‌బర్గ్‌’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్‌ లండన్‌లోని ఓ పాఠశాలలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న మలాలాను కలిశారు. తనకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బాలికల విద్యకోసం చేసిన పోరాటంలో తాలిబన్ల చేతిలో కాల్పులకు గురైన మలాలాకు 2014లో నోబెల్‌ శాంతి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న గ్రెటా థన్‌బర్గ్‌ కూడా 2019 సంవత్సరానికి నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని