సీఐసీగా బిమాల్‌ జుల్కా ప్రమాణం..! 

దిల్లీ: కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా బిమాల్‌ జుల్కా నియమితులయ్యారు. ఇప్పటివరకు సమాచార కమిషనర్‌ సభ్యులుగా ఉన్న జుల్కాను సీఐసీగా నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ప్రమాణాస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఐసీగా జుల్కాకు బాధ్యతలు అప్పగించారు.

Published : 06 Mar 2020 23:49 IST

దిల్లీ: కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా బిమాల్‌ జుల్కా నియమితులయ్యారు. ఇప్పటివరకు సమాచార కమిషనర్‌ సభ్యులుగా ఉన్న జుల్కాను సీఐసీగా నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ప్రమాణాస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఐసీగా జుల్కాకు బాధ్యతలు అప్పగించారు. అయితే, గత జనవరి 11న ప్రధాన కమిషనర్‌ పదవీవిరమణ చేసినప్పటినుంచి సీఐసీ స్థానం ఖాళీగానే ఉంది. అంతేకాకుండా సీఐసీలో మొత్తం 11 కమిషనర్‌ స్థానాలు మంజూరు అయినప్పటికీ(సీఐసీతో కలిసి)ప్రస్తుతం కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని