అరుణాచల్‌ ప్రదేశ్‌లో విదేశీయుల రాకపై నిషేధం

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈక్రమంలో రాష్ట్రంలోకి విదేశీయుల రాకపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Updated : 09 Mar 2020 02:00 IST

ఇటానగర్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌): కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోకి విదేశీయుల రాకపై నిషేధం విధించింది. కేరళలో తాజాగా ఒకే రోజు ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో వైరస్‌ బాధితుల సంఖ్య 39కి చేరింది. దీంతో అప్రమత్తమైన అరుణాచల్‌ప్రదేశ్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. కాగా.. కేరళలో ఇంతకుముందు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వైరస్‌ బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారిన పడి మరో ఐదుగురు తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు రక్షిత ప్రాంత అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కాగా.. చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని