ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతిజ్ఞ చేయాలి

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం స్పందించారు. బాధితులకు న్యాయం జరగడానికి దాదాపు ఏడు సంవత్సరాల కాలం పట్టిందన్నారు. నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు.

Updated : 20 Mar 2020 10:40 IST

దిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం స్పందించారు. బాధితులకు న్యాయం జరగడానికి దాదాపు ఏడు సంవత్సరాల కాలం పట్టిందన్నారు. నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇటీవల ఈ దోషులు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో అందరూ చూశారన్నారు. ఇంకా మన వ్యవస్థలో ఇలాంటివి చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు. వాటిని మెరుగు పరచవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులను శుక్రవారం ఉదయం తిహార్‌ జైల్లో ఉరి తీసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని