భార్యను హింసిస్తే క్వారంటైన్‌కు పంపిస్తాం

లాక్‌డౌన్‌లో గృహ హింస నుంచి మహిళలను రక్షించేందుకు మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. భర్తలు, వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు.........

Published : 17 Apr 2020 21:53 IST

పుణె: లాక్‌డౌన్‌లో గృహ హింస నుంచి మహిళలను రక్షించేందుకు మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. భర్తలు, వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. కౌన్సెలింగ్‌ తర్వాతా భార్యను వేధించేవారిని, అమానవీయంగా ప్రవర్తించే వారికి శిక్షగా క్వారంటైన్‌కు పంపిస్తామని హెచ్చరించింది.

‘మేం గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. స్థానిక నిఘా కమిటీ, అంగన్వాడీ సేవికా, గ్రామ పంచాయతీ మహిళా సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఇందులో సభ్యులుగా ఉంటారు. గృహహింస జరుగుతున్నట్టు తెలియగానే ఆ కుటుంబ సభ్యులకు వీరు కౌన్సెలింగ్‌ ఇస్తారు’ అని పుణె జిల్లా పరిషత్‌ ప్రధాన అధికారి ఆయుష్‌ ప్రసాద్‌ అన్నారు.

ప్రస్తుతానికి జిల్లాలో గృహ హింస కేసులు నమోదు కానప్పటికీ లాక్‌డౌన్‌లో ప్రస్తుతమున్న సరళిని బట్టి ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయుష్‌ తెలిపారు. ఫిర్యాదులు రాగానే కమిటీ సభ్యులు వెళ్లి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తరన్నారు. అప్పటికీ సదరు వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకుంటే, మహిళతో అమానవీయంగా ప్రవర్తిస్తే క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గృహహింస పెరిగినట్లు తెలుస్తోంది. భారత్‌లోనూ ఈ కేసులు ఎక్కువగానే ఉన్నాయి.

చదవండి: అక్కడ కరోనాతో 3 లక్షల మంది చనిపోతారు

చదవండి: నకిలీ కరోనాపై యుద్ధభేరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని