ప్రవాసభారతీయుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు

కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను మెరుగుపరిచి, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడినందుకు గాను ఐఐటీ(ముంబయి) పూర్వవిద్యార్థి, భారతీయ అమెరికన్‌ రాజీవ్‌జోషి...

Published : 26 May 2020 23:45 IST

వాషింగ్టన్‌: కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను మెరుగుపరిచి, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడినందుకు గాను ఐఐటీ(ముంబయి) పూర్వవిద్యార్థి, భారతీయ అమెరికన్‌ రాజీవ్‌జోషి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకున్నారు. ‘ఈ ఏడాది మేటి ఆవిష్కర్త’గా న్యూయార్క్‌ ఇంటలెక్చువల్‌ పాపర్టీ లా అసోసియేషన్‌ అతన్ని ఎంపిక చేసింది. ఇటీవల వర్చువల్‌గా జరిగిన వేడుకలో ఈ అవార్డు ప్రదానం చేశారు. న్యూయార్క్‌లోని ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న రాజీవ్‌జోషి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్, మెమరీ చిప్స్‌ తదితర 250కి పైగా ఆవిష్కరణలకు పేటెంట్లు పొందారు. ఇతని ఆవిష్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ జీవనం, సమాచార వ్యవస్థ, ఆరోగ్య, వైద్య రంగాల పురోభివృద్ధికి దోహదపడ్డాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని