
ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చిన మెర్కెల్
బెర్లిన్: అమెరికాలో జరగబోయే జీ-7 దేశాల సదస్సుకు జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హాజరుకాబోరని ఆమె కార్యాలయం ప్రకటించింది. ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడితే ఈ నిర్ణయంపై పునరాలోచిస్తామని తెలిపింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆమె హాజరయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ సదస్సు జూన్ 10-12 మధ్య జరగాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఇటీవల ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ.. జీ-7 దేశాల సదస్సు ఆయా దేశాధినేతల వ్యక్తిగత హాజరు నడుమ జరపాలనుకుంటున్నానని తెలిపారు. ఇంతకంటే పెద్ద పునఃప్రారంభం ఏముంటుందని వ్యాఖ్యానించారు. తద్వారా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన మెర్కెల్ తాజాగా ఆమె నిర్ణయాన్ని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?
-
Movies News
Modern Love Hyderabad: సరికొత్త ప్రేమకథలు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’
-
General News
Tamilisai and KCR: రాజ్‌భవన్‌కు కేసీఆర్.. గవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: టీమ్‌ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్ స్టోక్స్
-
Politics News
ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్‌లో చూడొచ్చు