రెండు దేశాలు కలిసి నడవాలి

భారత్-చైనాలు  పక్కపక్కనే నివసించే రెండు బలమైన దేశాలని, ఒకరిని ఇంకొకరు నాశనం చేసేందుకు ప్రయత్నించకూడదని...

Published : 10 Jul 2020 23:48 IST

భారత్-చైనా వివాదంపై దలైలామ వ్యాఖ్యలు

దిల్లీ: భారత్-చైనా పక్కపక్కనే ఉండే రెండు బలమైన దేశాలని, ఒకరిని ఇంకొకరు నాశనం చేసేందుకు ప్రయత్నించకూడదని ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇరు దేశాలను కోరారు. దాదాపు రెండు నెలలుగా వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో దలైలామా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరిచుకున్నాయి.

‘‘రెండూ శక్తిమంతమైన దేశాలు కలిసి జీవించాలి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో కొంత పోటీ భావన కనిపించింది. పూర్వం చైనా నుంచి బౌద్ధ గ్రంథాలను అనువదించేందుకు పలువురు పండితులు భారత్‌కు వచ్చారు. ఇలాంటి చారిత్రక సంబంధాలు ఇరు దేశాల మధ్య ఉన్నాయి. చారిత్రాత్మకంగా చైనా బౌద్ధ దేశం, భారత్ బుద్ధుడు నడచిన భూమి’’ అని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని