Booster Dose: అమెరికాలో బూస్టర్‌ డోసులు.. బైడెన్‌ ప్రభుత్వ యోచన 

అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్‌ డోసులు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని

Published : 03 Dec 2021 12:27 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్‌ డోసులు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాస్కులు ధరించడం తదితరాలు తప్ప కొత్త ఆంక్షలు ఏవీ లేకుండానే ఒమిక్రాన్‌ వంటి నూతన ఉత్పరివర్తనాలను ఎదుర్కోవాలని ప్రతిపాదించారు. ఇంటి దగ్గర కరోనా పరీక్షలు చేయించుకుంటే ఖర్చులు చెల్లించాలని ప్రయివేటు ఆరోగ్య బీమా సంస్థలను ఆదేశించనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా, తీసుకోకపోయినా ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా పరీక్షలు చేయించాలన్న నిబంధన కూడా విధించనున్నారు. దేశంలో మొత్తం పది కోట్ల మంది బూస్టర్‌ డోసులకు అర్హత సాధించారు. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ మరో 40.3 లక్షల మంది అసలు టీకాలే వేసుకోలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూస్టర్‌ డోసులపై అవగాహన కల్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని