మూలకణాలతో పిండాలకు పూర్వ దశ.. సృష్టించిన శాస్త్రవేత్తలు

మానవ మూల కణాలతో పిండానికి ముందు దశను పోలిన

Published : 07 Dec 2021 11:19 IST


న్యూయార్క్‌: మానవ మూల కణాలతో పిండానికి ముందు దశను పోలిన ఆకృతిని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వైద్య పరిశోధనలకు ప్రత్యామ్నాయంగా ఇది పనికొస్తుందని వారు తెలిపారు. ఈ ఆకృతులను బ్లాస్టాయిడ్లుగా పేర్కొంటారు. మానవ వృద్ధి, గర్భధారణ, గర్భనిరోధానికి సంబంధించి బయోమెడికల్‌ ఆవిష్కారాలు చేయడానికి ఇవి సమర్థంగా పనికొస్తాయని తెలిపారు.  ఈ విధానం నైతికంగానూ ఆమోదయోగ్యంగా ఉంటుందని వివరించారు. ఈ నిర్మాణాలు పిండాలు కావు. వీటిని రెండు వారాలకు మించి వృద్ధి చేయరు. ఈ బ్లాస్టాయిడ్‌.. బ్లాస్టోసిస్ట్‌కు నమూనాగా పనికొస్తుంది. శుక్ర, పిండ కణాలు ఫలదీకరణం చెందిన వారం లోపు ఈ బ్లాస్టోసిస్ట్‌ ఏర్పడుతుంది. ఇది కొన్ని కణాల సమూహం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని