
Published : 28 Dec 2021 10:54 IST
Yogi Adityanath: విద్యార్థులకు యోగి మరో కానుక
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో డిగ్రీ చదువుతున్న కోటి మంది విద్యార్థులకు ట్యాబ్, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం ప్రకటించింది. ఇంటర్మీడియెట్, మెట్రిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు, ట్యాబ్‌లు అందించనుంది. రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారికి రూ.లక్ష వంతున, జిల్లా స్థాయి ప్రతిభావంతులకు రూ.21,000 వంతున ఇవ్వనుంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Tags :