పెండింగ్‌ కేసులను తగ్గించడానికి ప్రభుత్వం, కోర్టులు కలిసి పనిచేయాలి

దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 4.90 కోట్ల కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సూచించారు.

Published : 25 Jan 2023 04:49 IST

 కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

దిల్లీ: దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 4.90 కోట్ల కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సూచించారు. సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యాలను పరిష్కరించడంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా కీలక భూమిక వహిస్తుందని తెలిపారు. న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌కు ప్రశంసలు

ఈ-కోర్ట్స్‌ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ను కేంద్ర మంత్రి రిజిజు ప్రశంసించారు. ఈ-కోర్ట్స్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3 కీలక దశలో ఉన్నందున కమిటీ ఛైర్మన్‌గా కొనసాగాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ను కోరగా అంగీకరించారని తెలిపారు. సీజేఐగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు కమిటీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలగుతారని, అయితే తన విజ్ఞప్తిని జస్టిస్‌ చంద్రచూడ్‌ గౌరవించారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని