పక్షుల కోసం రిసార్ట్‌

పక్షుల కోసం ప్రత్యేకంగా ఓ రిసార్టును ఏర్పాటు చేశారు మహమ్మద్‌ యాసిన్‌ అనే వ్యక్తి. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌ సరస్సు సమీపంలో దీన్ని నెలకొల్పారు.

Published : 27 Jan 2023 04:16 IST

పక్షుల కోసం ప్రత్యేకంగా ఓ రిసార్టును ఏర్పాటు చేశారు మహమ్మద్‌ యాసిన్‌ అనే వ్యక్తి. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌ సరస్సు సమీపంలో దీన్ని నెలకొల్పారు. చలికాలంలో అతిశీతల వాతావరణం కారణంగా వలస పక్షులతో పాటు, స్థానిక విహంగాలు ఆహార సేకరణకు బయటకు వెళ్లలేక ఇబ్బంది పడుతుంటాయి. వాటి కష్టాలను చూసి చలించిన మహమ్మద్‌ యాసిన్‌.. పక్షుల సమస్యను తీర్చడానికి వినూత్న ఆలోచన చేశారు. తన బోట్‌ హౌస్‌కు సమీపంలోనే పక్షుల రిసార్ట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ పక్షులకు ఆశ్రయమివ్వడంతోపాటు ఆహారం అందిస్తున్నట్లు ఈటీవీ భారత్‌కు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు