సోరస్ పక్షపాతి, ప్రమాదకారి.. ఆయనవి మూర్ఖపు అభిప్రాయాలు: కేంద్రమంత్రి జైశంకర్
పారిశ్రామికవేత్త గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర సర్కారుపై ప్రధాని నరేంద్రమోదీ పట్టును బలహీనపరిచే అవకాశం ఉందంటూ ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు.
దిల్లీ, సిడ్నీ: పారిశ్రామికవేత్త గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కేంద్ర సర్కారుపై ప్రధాని నరేంద్రమోదీ పట్టును బలహీనపరిచే అవకాశం ఉందంటూ ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మండిపడ్డారు. ఆయన్ని పక్షపాతిగా, ఒక దృక్కోణాన్ని ఆవిష్కరించి చూపేందుకు వనరుల్ని వినియోగించే వ్యక్తిగా అభివర్ణించారు. జర్మనీలోని మ్యూనిక్‌లో భద్రత సదస్సులో సోరస్ ప్రసంగిస్తూ.. మోదీ, అదానీల భవితవ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు చెప్పడాన్ని జైశంకర్ తప్పుపట్టారు. శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన చర్చల్లో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘సోరస్ ధనికుడు, వృద్ధుడు. ప్రమాదకారి. మూర్ఖమైన అభిప్రాయాలున్న వ్యక్తి. న్యూయార్క్‌లో కూర్చొని తన అభిప్రాయాల ప్రకారమే ప్రపంచమంతా నడుచుకోవాలని ఇప్పటికీ అనుకుంటారు. లక్షల మంది ముస్లింల పౌరసత్వంపై భారత్ వేటు వేయబోతోందని ఇదే సదస్సులో కొన్నేళ్ల క్రితం సోరస్ ఆరోపించారు. అలా లక్షలమందిని భయపెట్టే ప్రయత్నం చేయడం వల్ల సామాజిక కూర్పునకు భారీనష్టం వాటిల్లుతుంది’ అని చెప్పారు.
ఆస్ట్రేలియా ప్రధానితో భేటీ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్ శనివారం ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థికావకాశాలు, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు అంశాలపై చర్చించారు. ‘వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తిని మా భేటీ ప్రతిబింబించింది. ఈ భాగస్వామ్యంలోని తాజా పరిణామాలను వివరించాను. రెండు దేశాలూ ఇష్టపడే క్రికెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చేనెలలో తాను భారత్‌కు రాబోతున్నట్లు అల్బనీస్ తెలిపారు. మరో కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ భావసారూప్య దేశాలు కలిసి పనిచేయాలన్నారు.
మోదీ సర్కారు అంత దుర్బలమా?: చిదంబరం
విదేశానికి చెందిన ఒక పెట్టుబడిదారుడు చేసిన వ్యాఖ్యతో కుప్పకూలే దుర్బల స్థితిలో మోదీ సర్కారు ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. సోరస్ ఇప్పుడే కాకుండా గతంలోనూ మాట్లాడిన చాలా అంశాలతో తాను ఏకీభవించనని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యలను భాజపా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఎవరు అధికారంలో ఉండాలో బయటివారు కాకుండా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి