అమెరికా ప్రయోజనాల దృష్ట్యా భాజపా కీలకం

అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ(భాజపా) అత్యంత కీలకమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది.

Published : 22 Mar 2023 04:32 IST

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రఖ్యాత విద్యావేత్త విశ్లేషణ

న్యూయార్క్‌: అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. భారతీయ జనతా పార్టీ(భాజపా) అత్యంత కీలకమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది. ప్రపంచంలోనే మూడు దిగ్గజ రాజకీయ పార్టీలైన లికుడ్‌ పార్టీ ఆఫ్‌ ఇజ్రాయెల్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా, ముస్లిం బ్రదర్‌హుడ్‌ పార్టీ ఆఫ్‌ ఈజిప్ట్‌ల ముఖ్య సూత్రాలను భాజపా పుణికిపుచ్చుకుందని ప్రముఖ విద్యావేత్త వాల్టర్‌ రస్సెల్‌ మీడ్‌ ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’లో రాసిన వ్యాసంలో విశ్లేషించారు. భారతీయేతరులకు సంబంధంలేని రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం నుంచి అభివృద్ధి చెందడం వల్ల ఆ పార్టీని పాశ్చాత్య దేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు... శక్తిమంతమైన, సంక్లిష్ట వ్యవస్థ(భాజపా)ను సరిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, వారిని విమర్శించే వారితో పెద్ద సంఖ్యలో సమావేశాల తర్వాత నేను ఈ అభిప్రాయానికి వచ్చా’’నని వాల్టర్‌ రస్సెల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని