త్రిపుర పర్యాటక శాఖ ప్రచారకర్తగా గంగూలీ

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ త్రిపుర పర్యాటక శాఖకు ప్రచారకర్తగా నియమితులయ్యారు.

Updated : 25 May 2023 05:09 IST

దాదా రాజకీయ అరంగేట్రంపై మళ్లీ చర్చ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ త్రిపుర పర్యాటక శాఖకు ప్రచారకర్తగా నియమితులయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ఈ మేరకు ప్రకటించారు. త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ మంగళవారం కోల్‌కతాలోని గంగూలీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అటు సీఎం మాణిక్‌ సాహా కూడా గంగూలీతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో గంగూలీ రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. గంగూలీ భాజపాలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులైన సమయంలోనూ ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. దాదా భాజపా తరఫున మమతా బెనర్జీపై పోటీకి దిగనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2021లో గంగూలీ అనారోగ్యానికి గురైనప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు