సామూహిక వివాహాల్లో కు.ని.కిట్ల పంపిణీతో రభస

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్‌ కార్యక్రమ్‌’లో భాగంగా ఝాబువా జిల్లా థాందలా పట్టణంలో సోమవారం 292 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి.

Published : 31 May 2023 04:32 IST

ధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్‌ కార్యక్రమ్‌’లో భాగంగా ఝాబువా జిల్లా థాందలా పట్టణంలో సోమవారం 292 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. ఈ సందర్భంగా వధువులకు అందజేసిన అలంకరణ సామగ్రితోపాటు కుటుంబ నియంత్రణ మాత్రలు, కండోమ్‌లు ఇవ్వడం గొడవకు దారి తీసింది. సామూహిక వివాహాలంటూ ఇదేమిటని కు.ని. సామగ్రి పంపిణీపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఝాబువా జిల్లా సీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.పిఎస్‌.ఠాకుర్‌ వధూవరుల కుటుంబాలకు సర్దిచెప్పారు. ‘‘ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వాటిని పంపిణీ చేశాం. ఇందులో తప్పేమీ లేదు. జనాభా నియంత్రణపై చైతన్యం కల్పించడం మా బాధ్యత’’ అని ఆయన వివరించారు. మరోచోట.. డిండౌరీ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సామూహిక వివాహాల్లో వధువులను గర్భ పరీక్షలు చేయించుకోవాలని కొందరు కోరడం వివాదానికి దారి తీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని