Odisha Train Accident: పెను విషాదంలోనూ చేతివాటం..

కూలీ నాలీ చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లల కోసం ఓ తండ్రి కొన్న కొత్త దుస్తులు... బతుకుతెరువు కోసం బయల్దేరిన భవన నిర్మాణ కార్మికుడి

Updated : 05 Jun 2023 09:24 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో జరిగిన ఘోర విషాదంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. పట్టాలపై పడిపోయిన పర్సులు వెతుకుతూ వాటిలో ఉన్న డబ్బులు తీసుకున్నారు. మరికొందరు పట్టాల నిండా పడి ఉన్న కొత్త దుస్తులను, ఇతర విలువైన వస్తువులను ఏరుకుని తీసుకెళ్లారు.

పట్టాలపై.. పెను విషాద గుర్తులు

కూలీ నాలీ చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లల కోసం ఓ తండ్రి కొన్న కొత్త దుస్తులు... బతుకుతెరువు కోసం బయల్దేరిన భవన నిర్మాణ కార్మికుడి తాపీ, పెయింటింగ్‌ బ్రష్‌, ఇతర పనిముట్లు.. తెగిపోయిన చెప్పులు... చిరిగిపోయిన బట్టలు... అక్కడక్కడ ఆనవాళ్లుగా కనిపించే ఆధార్‌కార్డులు... పాస్‌పోర్టు సైజు ఫొటోలు.. బహానగా వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదానికి సంబంధించిన ఇలాంటి విషాద గుర్తులు అనేకం పట్టాలపై కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి, గాయపడ్డవారి వస్తువులు, బ్యాగులు, దుస్తులు, ఫొటోలు, పర్సులు.. ఇలాంటివి పట్టాలపైన, బోగీల్లోనూ చెల్లాచెదురుగా పడి ఉండి విషాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పట్టాలు తప్పింది రైళ్లు కాదు.. కొన్ని వందల కుటుంబాలు అనేందుకు పట్టాలపై పడి ఉన్న వస్తువులే సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని