బ్రిజ్‌ భూషణ్‌పై ఫిర్యాదులో మాట మార్చిన మైనర్‌ రెజ్లర్‌ తండ్రి

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై తాము ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టామని మైనర్‌ రెజ్లర్‌ తండ్రి అంగీకరించారు.

Published : 09 Jun 2023 03:55 IST

తప్పుడు కేసు పెట్టినట్లు వెల్లడి

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై తాము ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టామని మైనర్‌ రెజ్లర్‌ తండ్రి అంగీకరించారు. గత ఏడాది ఆ బాలిక ఒక పోటీకి భారతజట్టు తరఫున ఎంపిక కాకపోవడంతో అక్కసుతో సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు గురువారం ఒక వార్తాసంస్థకు తెలిపారు. కోర్టులో నిజం తేలేవరకు నిరీక్షించకుండా ఇప్పుడే వాస్తవం వెలుగుచూడాలనే అసలు విషయాన్ని చెబుతున్నట్లు బాలిక తండ్రి చెప్పారు. అండర్‌-17 రెజ్లర్ల ఆసియా స్థాయి ఛాంపియన్‌షిప్‌ పోటీలో తన కుమార్తె ఎందుకు ఎంపిక కాలేదో నిష్పాక్షిక విచారణలో తేల్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినందువల్ల తప్పును సరిచేసుకోవడం ధర్మంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని