కేజ్రీవాల్‌, ఆతిశీలపై పరువు నష్టం దావా

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ తాన్యా బామనీయాల్‌ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు.

Published : 30 Apr 2024 04:45 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ తాన్యా బామనీయాల్‌ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి మే 4కు వాయిదా వేశారు.

జైల్లో భర్తను కలిసిన సునీత

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌..తిహాడ్‌ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సీఎంను కలిసేందుకు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను జైలు అధికారులు అనుమతించడం లేదని సోమవారం ఉదయం ఆప్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే సునీత అభ్యర్థనను అధికారులు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం మంత్రి ఆతిశీతో కలిసి ఆమె తిహాడ్‌ జైలుకు వెళ్లారు. అనంతరం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చూడగానే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒకటే అడిగారు. పనులు ఎలా జరుగుతున్నాయి? స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు అందాయా? మొహల్లా క్లినిక్‌లలో ఔషధాలు సరిపడా ఉన్నాయా? అని ఆరా తీశారు. తాను కచ్చితంగా బయటకు వస్తానని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజలకు చెప్పాలని సందేశం పంపారు’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని