2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్‌

2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. ఇంతవరకు జపాన్‌ ఈ స్థానంలో ఉండేది.

Updated : 09 May 2024 05:49 IST

జపాన్‌ను అధిగమించామంటున్న నివేదిక

దిల్లీ: 2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. ఇంతవరకు జపాన్‌ ఈ స్థానంలో ఉండేది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5 శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ‘ఎంబెర్‌’ మేధోమథన సంస్థ నివేదిక తెలిపింది. ఇది మన దేశంలో 5.8 శాతంగా ఉంది. 2023లో సౌర విద్యుత్తు పెంచుకోవడంలో చైనా (+156 టెరావాట్‌ అవర్‌) మొదటి స్థానంలో ఉండగా అమెరికా (+33 టీడబ్ల్యూహెచ్‌), బ్రెజిల్‌ (+22 టీడబ్ల్యూహెచ్‌), భారత్‌ (+18 టీడబ్ల్యూహెచ్‌) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జలవిద్యుదుత్పత్తి ఐదేళ్ల కనిష్ఠస్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదేనని వివరించింది. పవన, సౌర విద్యుత్తు రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40 శాతానికి చేరినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని