బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు

చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 09 May 2024 04:52 IST

తేలికపాటి శ్రమతో ఊరట

దిల్లీ: చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. కదలికలు లేని సమయం పెరిగేకొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతుందని తేల్చింది. గుండె పరిమాణం పెరగడాన్ని లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ హైపెట్రోఫీగా పేర్కొంటారు. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, అకాల మరణాల ముప్పు పెరుగుతుంది. రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు తేలికపాటి శారీరక శ్రమ చేయడం ద్వారా.. పెరిగిన గుండె పరిమాణాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటి చర్యలు పెరిగితే గుండె పనితీరు మెరుగుపడుతుందని తెలిపింది. చిన్నారులు, కౌమార ప్రాయంలో ఉన్న 1700 మంది పరీక్షార్థులను 13 ఏళ్ల పాటు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. శారీరక శ్రమ పెద్దగాలేని జీవనశైలి.. గుండె పరిమాణంలో పెరుగుదలకు 40 మేర కారణమైనట్లు గుర్తించారు.  శారీరక చురుకుదనం లోపించిన అందరిలో ఈ ఇబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. తేలికపాటి శారీరక శ్రమ వల్ల గుండె పరిమాణంలో పెరుగుదల సగం మేర తగ్గినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని