విదేశీ ప్రయాణాల కోసం మూడో డోసు

విద్య, ఉపాధి, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్న మూడు నెలల తరవాత ముందు జాగ్రత్తగా మూడో డోసు (బూస్టర్‌) తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం

Published : 14 May 2022 05:02 IST

దిల్లీ: విద్య, ఉపాధి, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్న మూడు నెలల తరవాత ముందు జాగ్రత్తగా మూడో డోసు (బూస్టర్‌) తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇంతకుముందు రెండో డోసు తరవాత 9 నెలలకు మూడో డోసు తీసుకోవాలనే నిబంధన ఉండేది. దాన్ని గురువారం సడలించిన తరవాత కేంద్రం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. మూడో డోసు తీసుకున్న వారు వీసా పత్రాలు సమర్పించకుండానే కొవిన్‌ పోర్టల్‌ నుంచి ధ్రువీకరణ పొందేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. విద్య, ఉపాధి, వ్యాపారం, క్రీడలు, అధికారిక సమావేశాల కోసం విదేశాలకు వెళ్లవలసిన వారి విజ్ఞప్తిపై తొమ్మిది నెలల గడువుకు ముందే మూడో డోసును అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ ఆగ్నానీ వివరించారు. ఇంతవరకు ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, రవాణా కార్మికుల వంటి అత్యవసర సిబ్బందికి, 60 ఏళ్లు పైబడిన వారికీ రెండు డోసులు వేసిన తొమ్మిది నెలలకు మూడో డోసును అనుమతిస్తున్నారు. 18 ఏళ్లకుపైన 60 ఏళ్లలోపు వయసు వారు కూడా రుసుము చెల్లించి ప్రైవేటు కేంద్రాల్లో మూడో డోసు తీసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని