ఆ బీచ్‌లో మద్యం తాగితే ₹10వేలు ఫైన్‌!

గోవా పర్యాటక శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. బీచ్‌ల్లో మద్యం తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవాలోని పలు తీర ప్రాంతాలు మద్యం సీసాలతో.......

Updated : 08 Jan 2021 22:28 IST

పనాజీ: గోవా పర్యాటక శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. బీచ్‌ల్లో మద్యం తాగితే రూ.10వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గోవాలోని పలు తీర ప్రాంతాలు మద్యం సీసాలతో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీచ్‌ల్లో మద్యం తాగొద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినట్టు పర్యాటక శాఖ డైరెక్టర్‌ మెనినో డిసౌజా తెలిపారు. బీచ్‌లలో మద్యం తాగితే వ్యక్తులపై రూ.2వేలు, సమూహాలపై రూ.10వేలు చొప్పున జరిమానా విధించేలా 2019 జనవరిలోనే పర్యాటక వాణిజ్య చట్టానికి సవరణలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సవరించిన చట్టాన్ని పర్యాటక శాఖ పోలీసుల ద్వారా అమలుచేయనున్నట్టు తెలిపారు. తమ శాఖకు సిబ్బంది తగినంతగా ఉంటే వారితోనే సొంతంగా దీన్ని అమలు చేయగలుగుతామని మెనినో డిసౌజా అన్నారు.

ఇదీ చదవండి..

బర్డ్‌ ఫ్లూ: గుడ్డు..మాంసం తినొచ్చా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని