Ads: ఐదేళ్లలో ప్రకటనలకు కేంద్రం చేసిన ఖర్చెంతో తెలుసా?

గత ఐదేళ్లలో దేశంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనల (advertisements) కోసం చేసిన ఖర్చుల వివరాలను కేంద్రం వెల్లడించింది......

Updated : 18 Aug 2022 15:50 IST

దిల్లీ: గత ఐదేళ్లలో దేశంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనల (advertisements) కోసం చేసిన ఖర్చుల వివరాలను కేంద్రం వెల్లడించింది. 2017 నుంచి ఇప్పటివరకు ప్రింట్‌/ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తెలిపారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2017-18 నుంచి ఈ ఏడాది జులై 12 వరకు ప్రింట్ మీడియాలో ప్రకటనలకు రూ.1756.48 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనల కోసం రూ.1583.01 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని