‘మొత్తానికి మీకు హీరోయిన్లే కావాలన్నమాట’.. కంగనా పోటీపై హేమమాలిని వ్యాఖ్యలు

కంగనా పోటీ గురించి విలేకరులు హేమా మాలిని గురించి ప్రస్తావించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 25 Sep 2022 01:28 IST

మథుర: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. వివిధ అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే ఆమె.. ఈ సారి మాత్రం వార్తాంశంగా మారారు. విషయమేంటంటే.. చాలా సందర్భాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు కంగన మద్దతుగా మాట్లాడారు. కొన్నిసార్లు భాజపా నేతలు సైతం ఆమెకు అండగా నిలిచారు. దీంతో ఆమె ఆ పార్టీ టికెట్‌పై యూపీలోని మథుర నుంచి చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఆ స్థానంలో భాజపాకు చెందిన హేమమాలిని ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా పోటీ గురించి విలేకరులు హేమా మాలిని గురించి ప్రస్తావించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘అయినా దీనిపై నేనేం మాట్లాడగలను. అంతా దేవుడి దయ. కృష్ణుడు తాను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు’’ అని హేమామాలిని తొలుత సమాధానమిచ్చారు. కాసేపటికే మళ్లీ అందుకుని ‘‘అయితే మొత్తానికి మథుర నుంచి స్థానికులలెవరికీ అవకాశం ఇవ్వరన్నమాట. సినీ నటులే ఇక్కడ పోటీ చేయాలని మీరు బలంగా నిర్ణయించుకున్నారు. సినిమా స్టార్‌లను మాత్రమే మథుర కోరుకుంటే రాఖీ సావంత్‌ కూడా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తుంది’’ అని సమాధానం ఇచ్చారు. అయితే కంగన పోటీ చేయడం ఇష్టం లేకనే ఆమె ఇలా అన్నారా? లేదంటే అసందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు వ్యంగ్యంగా అన్నారా? అనేది తెలియరాలేదు. గత రెండు పర్యాయాలుగా (2014, 2019) మథుర ఎంపీగా హేమమాలిని కొనసాగుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని