India Corona: కట్టడిలోనే కరోనా.. కానీ!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. అయితే స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Published : 18 Aug 2022 10:10 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. అయితే, స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దిల్లీలో ఆగస్టు 1 నుంచి ఈ మహమ్మారి బారిన పడినవారిలో 60శాతం మంది ఆస్పత్రుల్లో చేరినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా 1,600లకు పైగా కేసులొచ్చాయి. పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరువైంది. మహారాష్ట్రలో 1,800లకు పైగా కేసులు రాగా.. ఒక్క ముంబయిలోనే ఆ సంఖ్య 975గా ఉంది. కేరళలో కూడా వెయ్యికి పైగా కేసులు వెలుగుచూశాయి. ఇవన్నీ కలిపి దేశవ్యాప్తంగా 12 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారని గురువారం కేంద్రం వెల్లడించింది. 

24 గంటల వ్యవధిలో 3.62 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 12,608 కొత్త కేసులు వచ్చాయి. ముందురోజు కంటే మూడువేల మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. 16,251 మంది కోలుకున్నారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కనిపిస్తున్నప్పటికీ.. మొత్తంగా కేసులు కట్టడిలో ఉన్నాయి. దాంతో క్రియాశీల కేసులు 1,01,343(0.23శాతం)కి తగ్గాయి. ఇప్పటి వరకూ 4.42 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడగా.. 98.58 శాతం మంది వైరస్‌ను జయించారు. గత ఏడాది ప్రారంభం నుంచి 208 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ కాగా.. నిన్న 38.64 లక్షల మంది టీకా తీసుకొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని