Corona: ముక్కున వేలేసుకునేలా చేసిన చిత్రమిది!

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్ల పాత్ర అంతా ఇంతా కాదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 18 నెలలుగా వైరస్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. మన ఇంటి చుట్టు పక్కల ఒక్క కేసు నమోదైతేనే ఎంతో ఆందోళన చెందుతాం. అలాంటిది వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది నిత్యం వారితోనే ఉంటూ వైద్యం సేవలు అందిస్తున్నారు. అయితే కొన్నిసార్లు వైద్య సిబ్బందికి ....

Updated : 08 Jun 2021 21:51 IST

దిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్ల పాత్ర అంతా ఇంతా కాదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 18 నెలలుగా వైరస్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. మన ఇంటి చుట్టు పక్కల ఒక్క కేసు నమోదైతేనే ఎంతో ఆందోళన చెందుతాం. అలాంటిది వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది నిత్యం వారితోనే ఉంటూ వైద్యం సేవలు అందిస్తున్నారు. అయితే కొన్నిసార్లు వైద్య సిబ్బందికి సాహసాలు చేయక తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ఎన్నో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. దీనికి నిదర్శనమే ఈ ఫొటో. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నలుగురు సభ్యుల వైద్య బృందం జేసీబీ తొట్టెలో కూర్చొని లద్దాఖ్‌ నదిని దాటి అవతలి గ్రామాల్లో వైద్యం చేస్తున్నారు. తాజాగా ఈ ఫొటోను లద్దాఖ్‌ ఎంపీ జమయాంగ్‌ సోరింగ్‌ నామమ్యాల్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

కొవిడ్‌ విస్తృతి నేపథ్యంలో ఎక్కువ పని గంటలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నప్పటికీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శించి మరీ వైద్యం చేస్తున్న వారిని చూసి గర్వించాలి అని ఆయన అన్నారు. ‘‘ కొవిడ్‌ వారియర్లకు సెల్యూట్. లద్దాఖ్‌ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు వైద్యబృందం నదిని దాటుతోంది. ఇంటి వద్దనే క్షేమంగా.. ఆరోగ్యంగా ఉండండి. కరోనా వారియర్లకు సహకరించండి’’ అని జమయాంగ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అది కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. వైద్యుల నిబద్ధతను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని