తండ్రి మృతి.. నటాషా నర్వాల్‌కు బెయిల్‌

దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా ఉద్యమకారిణి నటాషా నర్వాల్‌కు బెయిల్ లభించింది. కరోనా కారణంగా తండ్రి మరణించడంతో నటాషా నర్వాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది....

Published : 11 May 2021 01:09 IST

దిల్లీ: దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా ఉద్యమకారిణి నటాషా నర్వాల్‌కు బెయిల్ లభించింది. కరోనా కారణంగా తండ్రి మరణించడంతో నటాషా నర్వాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు నటాషాను అరెస్టు చేశారు.  చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు నిర్ధరిస్తూ దిల్లీ హైకోర్టు నటాషా జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తోంది.

నటాషా తండ్రి మహవీర్‌ నర్వాల్‌ కరోనా సోకి ఆదివారం మృతిచెందారు. ఆమె సోదరుడు ఆకాశ్‌ సైతం కొవిడ్‌ సోకి చికిత్స పొందుతున్నాడు. మహవీర్‌ నర్వాల్‌కు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో నటాషా నర్వాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. నటాషా నర్వాల్‌ తండ్రి మృతిపట్ల సీపీఐ(ఎమ్‌) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారట్‌ విచారం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని