కూరగాయల బామ్మతో చెంపపై కొట్టించుకున్న మంత్రి

మధ్యప్రదేశ్‌ ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తన గొప్ప మనసు

Updated : 15 Jan 2022 10:40 IST

మధ్యప్రదేశ్‌ ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. గ్వాలియర్‌లో కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరారు. రోడ్డుపై రద్దీ పెరుగుతోందన్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెటును అధికారులు మరోచోటుకు తరలించబోయారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మంత్రిని చూసి.. బాబినా బాయ్‌ అనే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలమ్మి బతికే తనకు ఉపాధిని దూరం చేస్తున్నారని కంటతడి పెట్టారు. బామ్మను శాంతింపజేసేందుకు పరిస్థితిని వివరించిన మంత్రి అసౌకర్యానికి క్షమించమని కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని