IN PICS: పార్లమెంట్‌ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi:  పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పరిశీలించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడొచ్చు..

Updated : 30 Mar 2023 22:05 IST

దిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ నూతన భవనాన్ని(New parliament building) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.  తుది దశలో ఉన్న నిర్మాణ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో టేబుళ్లు, నడక మార్గాల్లో కలియ తిరుగుతూ దాదాపు గంట సమయం పాటు ప్రధాని అక్కడే ఉన్నట్టు సమాచారం. అక్కడ కొనసాగుతున్న పనులన్నింటినీ పరిశీలించి  పనిచేస్తున్న కార్మికులు, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.  ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఉన్నారు. గతేడాది నవంబర్‌ నాటికే  నిర్మాణం పూర్తి చేయాలని భావించినప్పటికీ.. కొవిడ్‌ కారణంగా ఆలస్యమైంది.  ఈ నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. అత్యాధునిక వసతులతో నిర్మాణం చేపట్టిన పార్లమెంట్‌ కొత్త  భవనానికి 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 

దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్‌ హంగులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌, ఎంపీల లాంజ్‌, లైబ్రరీ, కమిటీ రూమ్‌లు, డైనింగ్ ప్రదేశాలు, తగినంత పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నారు.  ఈ నిర్మాణ ప్రాజెక్టును టాటా కంపెనీ చేస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని