హెలికాప్టర్‌లో మనవరాలికి స్వాగతం పలికిన రైతు..

ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేయించే వాళ్లు, ఆడపిల్లని పురిటిలోనే చంపేసేవాళ్లు ఈ రైతుని చూసి ఎంతో నేర్చుకోవాలి.

Updated : 27 Apr 2022 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించే వాళ్లు.. ఆడపిల్లని పురిటిలోనే చంపేసేవాళ్లు ఈ వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకోవాలి. తనకు మనవరాలు పుట్టిందని తెలిసి ఏకంగా హెలికాప్టర్‌లో తనని ఇంటికి తీసుకువచ్చాడు. అయితే.. ఆయన బడా వ్యాపారవేత్తో, సినీ ప్రముఖుడో కాదు. నాగలి పట్టి పొలం దున్నే ఓ రైతు.

వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్‌ బల్వాడ్కర్‌కు మనవరాలు పుట్టిందని తెలిసి ఆనందంలో ఉప్పొంగిపోయాడు. మంగళవారం ఆ పాపను అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకురావడానికి హెలికాప్టర్‌ బుక్‌ చేశాడు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న ఆయన ‘మా కుటుంబంలోకి ఆడపిల్ల రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మా సరికొత్త సభ్యురాలు కృషికాకు మేమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇలా ఆకాశమార్గంలో ఆమెను తీసుకువచ్చాం’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని