Independence Day celebrations: భద్రతా వలయంలో దిల్లీ నగరం

స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వేలాది మంది భద్రతా సిబ్బంది పలు వ్యూహాత్మక.....

Updated : 14 Aug 2021 21:09 IST

దిల్లీ: స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వేలాది మంది భద్రతా సిబ్బంది పలు వ్యూహాత్మక ప్రాంతాలతో సహా  దిల్లీ సరిహద్దుల్లో మోహరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న వేళ అక్కడ బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినల్స్‌తో పాటు నగరవ్యాప్తంగా భారీగా బారికేడ్లు పెట్టారు. 

విధ్వంస నిరోధక చర్యల్లో భాగంగా పోలీసులు యమునా నదిలో మోటార్‌ బోట్లతో పాటు నగరవ్యాప్తంగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ కొనసాగిస్తున్నారు. ఈసారి స్వాతంత్ర్య వేడుకల్లో వైమానిక వస్తువులు, బెలూన్లు అనుమతించడంలేదని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. నగరంలో పలు వ్యూహాత్మక ప్రదేశాలు, ఎర్రకోట వద్ద సివిల్‌ డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని అదనపు నిఘాలో భాగంగా మోహరించారు. దిల్లీ సరిహద్దుల్లో వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. దేశ రాజధాని నగరంలోని ప్రధాన మార్గాలను  రేపు ఉదయం 4గంటల నుంచి 10గంటల వరకు మూసివేస్తున్నట్టు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని