Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను (Brij Bhushan) జూన్ 9లోగా అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ కేంద్రాన్ని హెచ్చరించింది.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ‘‘ రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలి. లేదంటే అదే రోజు నుంచి రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద మేం కూడా దీక్షకు కూర్చుంటాం. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తెలిపారు. రెజ్లర్లపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలన్నారు.
మరోవైపు జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేసుకునేందుకు అనుమతివ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా గురువారం ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా మెమోరాండాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపింది. జంతర్‌మంతర్‌లో ఆందోళనకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమెను కోరింది. భారత పుత్రికల గౌరవాన్ని కాపాడాలని, నెల రోజులుగా సాగుతున్న ఆందోళనకు త్వరగా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసి విచారించాలని, తద్వారా ఛార్జిషీట్‌ను త్వరగా కోర్టులో నివేదించవచ్చని సూచించింది.
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారంటూ.. ఒలింపిక్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన సాక్షిమాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, సంగీత ఫొగాట్ తదితర అంతర్జాతీయ స్థాయి రెజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన