North Korea: ఉ.కొరియాలోకి ప్రవేశించిన ద.కొరియా వాసి..!

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉన్న నిస్సైనిక మండలంలోకి ఒక సామాన్యుడు ప్రవేశించాడు. అతను ద.కొరియా నుంచి ఉ.కొరియాలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

Published : 02 Jan 2022 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉన్న నిస్సైనిక మండలంలోకి ఒక సామాన్యుడు ప్రవేశించాడు. అతను ద.కొరియా నుంచి ఉ.కొరియాలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తి కోసం దక్షిణ కొరియా సైనిక అధికారులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, ఆచూకీ లభించలేదు. మరోవైపు ఉత్తర కొరియా అధికారులకు కూడా ఆ వ్యక్తి గురించి సమాచారం అందజేశారు. కానీ, అతను జీవించి ఉన్నాడని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే విదేశీయులు ఉత్తర కొరియాలో అక్రమంగా ప్రవేశిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. దీనికి తోడు నిస్సైనిక మండలంలో భారీ ఎత్తున మందుపాతరలు, విద్యుత్తు కంచె, నిఘా కెమేరాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ 2020లో దక్షిణ కొరియా మత్స్యశాఖ అధికారులను ఉత్తర కొరియా సైనికులు హత్య చేసి దహానం చేశారు. ఈ ఘటనతో అప్పట్లో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. 

కొన్నాళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ ఉత్తరకొరియా వాసిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. కిమ్‌ నిబంధనలు కఠిన తరం చేయడంతో ఉ.కొరియా నుంచి ద.కొరియాకు పారిపోయేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని