కొవిడ్ ఉద్ధృతి: తమిళనాడులో తాజా ఆంక్షలివే!
చెన్నై: కరోనా విలయతాండవం రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా ఆంక్షల వైపు అడుగులేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ జాబితాలోకి చేరింది.
చెన్నై: కరోనా విలయ తాండవం కొన్ని రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఆంక్షల వైపు అడుగులేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ జాబితాలోకి చేరింది. కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్ జోలికి వెళ్లకుండా కఠిన ఆంక్షల వైపు మొగ్గుచూపింది. మాస్కులు ధరించి, కరోనా జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు విఫలమైనందువల్ల ఈ ఆంక్షలు తప్పడం లేదని చెప్పింది. ఏప్రిల్ 10నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా ఆంక్షలివే..
* పండుగలు, మతపరమైన బహిరంగ సమావేశాలపై నిషేధం.
* చెన్నైలోని ఎంటీసీ బస్సులతో సహా రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో సీట్లకు మించి ప్రయాణికులకు అనుమతి లేదు.
* అంతరాష్ట్ర బస్సు సర్వీసులకూ ఇదే పద్ధతి.
* తదుపరి ఉత్వర్వులు వచ్చేవరకూ చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో పండ్లు, కూరగాయల దుకాణాలు బంద్.
* టీ కొట్టు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, సినీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలి.
* కేవలం 100 మందితోనే శుభకార్యాల నిర్వహణ.
* సామాజిక, రాజకీయ, విద్య, వినోదం, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు 200 మందికి అనుమతి.
* ప్రార్థన మందిరాల్లోకి భక్తులకు రాత్రి 8 గంటల వరకే అనుమతి. పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం.
* సినిమా షూటింగ్, ఇతర కార్యక్రమాలను కరోనా నిబంధనల మేరకే అనుమతి.
* కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఆంక్షల అమలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: ఘనంగా నిమజ్జనోత్సవం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్