
Donald Trump: డొనాల్డ్ ట్రంప్.. బ్లాక్‌బెల్ట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(75)కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్ ఆర్ట్స్ సంస్థ కక్కివొన్.. ట్రంప్‌ను 9వ ర్యాంక్ డాన్ బ్లాక్‌బెల్ట్‌తో సత్కరించింది. ఈ సంస్థ అధ్యక్షుడు లీ డాంగ్ సియోప్.. అమెరికా ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసానికి వెళ్లి అవార్డును స్వయంగా అందజేశారు. ధ్రువపత్రాన్ని కూడా అందించారు. ట్రంప్‌నకు తైక్వాండో పట్ల ఆసక్తి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని డాంగ్ సియోప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బ్లాక్ బెల్టు అందుకున్న అనంతరం ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే బెల్టు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ గౌరవం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆత్మరక్షణకు తైక్వాండో గొప్ప మార్షల్ ఆర్ట్ అని ట్రంప్ ప్రశంసించారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే ఈ బ్లాక్‌బెల్టు ధరించి కాంగ్రెస్(శాసనసభ)కు హాజరవుతానని వ్యాఖ్యానించారు. ట్రంప్ కంటే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బ్లాక్బెల్టుతో సత్కరించింది దక్షిణ కొరియా. 2013లో ఆయన ఆ దేశ పర్యటనకు వెళ్లినప్పుడు తైక్వాండో గ్రాండ్ మాస్టర్‌గా కూడా ప్రకటించింది.
కాగా ట్రంప్ నివాసంలోని గోడపై పలు ఆసక్తికర ఫొటోలు దర్శనమిచ్చాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ఉన్ను 2019లో పన్ముంజోమ్లో కలిసిన ఫొటోతో పాటు బ్రిటన్ రాణిని కలిసిన చిత్రాలు ఉన్నాయి. మెలానియా ట్రంప్‌తో ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ను కలిసేందుకు వెళ్లిన ఫొటో కూడా ఆకర్షణీయంగా ఉంది.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.