Health Ministry: ఒత్తిడిలో ఉన్నాం.. ఖాళీలు భర్తీ  చేయండి

కొవిడ్‌పై జరుపుతున్న పోరాటంలో ఆరోగ్య శాఖ అనుభవజ్ఞులైన అధికారుల కొరతను ఎదుర్కొంటోంది. ఆ పోస్టుల భర్తీకి మరోసారి మానవ వనరుల శాఖకు లేఖ రాసింది. రెండు నెలల క్రితం ఇదే విషయంపై లేఖ రాసినట్లు గుర్తుచేసింది. ఖాళీల కారణంగా ఎదుర్కొంటోన్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Published : 16 Oct 2021 02:08 IST

దిల్లీ: కొవిడ్‌పై చేస్తున్న పోరాటంలో ఆరోగ్య శాఖ అనుభవజ్ఞులైన అధికారుల కొరతను ఎదుర్కొంటోంది. ఆ పోస్టుల భర్తీకి మరోసారి మానవ వనరుల శాఖకు లేఖ రాసింది. రెండు నెలల క్రితం ఇదే విషయంపై లేఖ రాసినట్లు గుర్తుచేసింది. ఖాళీల కారణంగా ఎదుర్కొంటోన్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేసింది. 

‘దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉంది. అయితే కరోనాపై జరుపుతున్న పోరాటాన్ని ఇప్పుడే నిలిపివేయలేం. ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉండాలి. జాయింట్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో ఖాళీలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలతో సహా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలో పేర్కొంది. పలు పోస్టుల భర్తీకి ఆగస్టు 12నే ఒకసారి లేఖ రాసింది. 

మరోపక్క దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 97 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలో భారత్ 100 కోట్ల మార్కుకు చేరువ కానుంది. ఈ క్రమంలో కొవిడ్ నిర్వహణను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖకు అనుభవజ్ఞుల అవసరం కానున్నారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో 20 వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని