Supreme Court: కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తున్నారా?.. ప్రశ్నించిన ధర్మాసనం

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో సహా నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.....

Published : 29 Nov 2021 23:42 IST

దిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో సహా నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఏ మేరకు పాటిస్తున్నారో తెలపాలని దిల్లీ, ఎన్‌సీఆర్ రాష్ట్రాలను కోరింది. ఒకవేళ పాటించలేకపోతే దానికి సంబంధించి అఫిడవిట్​లను బుధవారం సాయంత్రంలోగా దాఖలు చేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ.. ‘కాలుష్యంపై కమిటీ ఇచ్చిన సూచనలు మంచివే. కానీ, ఫలితం శూన్యం. ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానా విధించడం లేదా ఒక రోజు జైలు శిక్ష విధించడం వంటి చర్యలు పనిచేయడంలేదు. మాకేమీ తెలియదనుకోవద్దు. మాకు అన్నీ తెలుసు. పిటిషన్​లో కొన్ని అంశాలను దాటవేసి ప్రధాన సమస్యని దారి మళ్లించే ప్రయత్నం చేయొద్దు’ అని పేర్కొంది.

సెంట్రల్ విస్టా వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలు శరవేగంగా సాగుతున్నాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ తరహా ప్రాజెక్టులు పౌరుల జీవితాల కన్నా ముఖ్యమైనవి కావని విన్నవించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని