Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
నాగాలాండ్(Nagaland) మంత్రి తెమ్జెన్ నెట్టింట్లో పెట్టే పోస్టులు ఆకట్టుకుంటాయి. తాజాగా ఆయనకూ షాదీ. కామ్ వ్యవస్థాపకుడికి మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది.
కోహిమా: నాగాలాండ్(Nagaland) మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along) నెట్టింట్లో సరదాగా స్పందిస్తుంటారు. తనపై తానే జోకులు పేల్చుకుంటారు. తాజాగా ఓ ఫొటో షేర్ చేసిన ఆయన తన పెళ్లి గురించి మాట్లాడారు.
‘సోఫానా..? లేక నేనా..? ఎవరు రిలాక్స్ అవుతున్నారో చెప్పుకోండి చూద్దాం. అనుపమ్ మిత్తల్‌జీ ఇచ్చిన ఆఫర్‌ను నేను ఇంతవరకు అంగీకరించలేదు. అందుకే నా పక్కన ఉన్న కుర్చీ ఖాళీగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు మాత్రం నేను అవతార్ సినిమా చూస్తున్నాను’ అంటూ ఇమ్నా ట్వీట్ చేశారు. అలాగే అనుపమ్ మిత్తల్‌ను ట్యాగ్ చేశారు. ఆ మిత్తల్.. షాదీ. కామ్ వ్యవస్థాపకుడు. ఇమ్నాకు ఆయన బదులిస్తూ.. ‘ఆ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉంది’ అని చెప్పారు.
అసలు ఈ సంభాషణకు పునాది గత ఏడాది జులైలోనే పడింది. గూగుల్ సెర్చ్‌లో తెమ్జెన్ భార్య అంటూ ఉన్న స్క్రీన్ షాట్‌ను మంత్రి షేర్ చేస్తూ ట్విటర్‌లో స్పందించారు.
తెమ్జెన్: గూగుల్ సెర్చ్ నన్ను ఉత్సాహానికి గురిచేసింది. ఇప్పటికీ నేను ఆమె కోసం వెతుకుతున్నాను
మిత్తల్: ఏదో ఒకటి చేయాలి
తెమ్జెన్: ఇప్పటికీ బాగానే ఉంది. సల్మాన్ భాయ్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇలా అప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ తరహాలో ఇద్దరూ ముచ్చటించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
-
India News
Indian Railway: ఆర్పీఎఫ్లో 20 వేల ఉద్యోగాలు.. రైల్వేశాఖ క్లారిటీ